పేదలందరికీ సొంత ఇల్లు శాశ్వత చిరునామా కల్పిస్తాం

రిపోర్టర్: రాజేష్ స్థలం: కర్నూలు

ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, శాశ్వత చిరునామా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండేళ్లలో 5,50,000 ఇళ్లు అందించామని, రాబోయే మార్చి నాటికి మరో 5,52,000 ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అర్హుల అసెస్మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.