అనకాపల్లి జిల్లాలో నూతన ఆయుష్మాన్ భవనం మరియు జెడ్పీ కార్యాలయం ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆయుష్మాన్ భవనాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించినట్లు ఆయన కార్యవర్గం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో కలిసి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించినట్లు తెలిపారు.