సిక్కింలో భారీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన పలు ఇళ్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: Sikkim
పశ్చిమ సిక్కిం జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. రింబి గ్రామంలో బురద, రాళ్లు జనావాసాలపైకి దూసుకెళ్లడంతో విద్యుత్ శాఖ క్వార్టర్లతో పాటు అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ సిబ్బంది ముందుచూపుతో 128 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పిందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.