అమలాపురంలో గణపతి స్వామికి కిలో వెండి తొడుగు సమర్పణ
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అమలాపురం
అమలాపురం పట్టణం దుడ్డువారి అగ్రహారంలోని బాల విద్యార్థి గణపతి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. యల్లమిల్లి శేషగిరిరావు అండ్ సన్స్ ఆధ్వర్యంలో, కిలో వెండితో తయారు చేసిన ప్రత్యేక తొడుగును స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించారు.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు దాతల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మార్మోగింది.