ఏపీలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు నూతన మార్గదర్శకాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులు కపాస్ కిసాన్ యాప్లో పేర్లు నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధర చెల్లించనుండగా, ఆధార్ అనుసంధానంతో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.