మరికల్ లో ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
రిపోర్టర్: సతీష్
స్థలం: మరికల్
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ నుంచి మక్తల్ వైపు వెళ్తున్న బీజేపీ ఎంపీ డీకే అరుణ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.