నగరంలో వాహన తనిఖీలు ముమ్మరం: భద్రతను పెంచేలా విశాఖ పోలీసుల చర్యలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగర భద్రతను మరింత పెంచేలా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పలు ప్రదేశాలలో అధికారులు సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు VizagCityPolice వెల్లడించారు. నగరంలోకి ఎటువంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.