లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ పోటీలపై స్పష్టతనిచ్చిన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: లాస్ ఏంజెల్స్

అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మాజీ సహచరురాలు జోస్లిన్ రాబర్సన్ ఇచ్చిన సలహా తనకు కొత్త ఆలోచన రేకెత్తించిందని పేర్కొన్నారు. కుటుంబ జీవితం, భర్త జోనథన్ ఓవెన్స్తో గడపడం వంటి వ్యక్తిగత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిమ్నాస్టిక్స్లో సుదీర్ఘ కెరీర్, భవిష్యత్ ప్రణాళికలపై త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు.