సినిమా టీజర్ ఆవిష్కరణ: హుషారు-2 చిత్రంలో విప్లవ పాత్రలో నారాయణమూర్తి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

యువతరాన్ని ఆకట్టుకున్న హుషారు చిత్రానికి సీక్వెల్గా వస్తున్న హుషారు-2 సినిమా టీజర్ను పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి మంగళవారం ఆవిష్కరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో ఆయన విప్లవ నాయకుడి పాత్రలో కనిపించడం విశేషమని, నిరుద్యోగ సమస్యపై చర్చించడంతో పాటు యువత స్వతంత్రంగా బతకాలనే సందేశాన్ని ఈ కథ ఇస్తుందని దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి పేర్కొన్నారు.