రెండో విడతలో 59 వేల గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో 59 వేల మంది గుడిసెవాసులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. పేదల ఉపాధికి దూరం చేసేలా వారిని 30-40 కిలోమీటర్లు తరలించే విధానాన్ని ప్రభుత్వం అనుసరించదని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, అర్హులకే ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.