వైద్యులపై అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు: ఐఎంఏ ఖమ్మం శాఖ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

వైద్యులు మరియు ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు లేదా బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన క్రిమినల్, సివిల్ మరియు పరువునష్టం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి హరిప్రసాద్ మరియు కార్యదర్శి డాక్టర్ ముక్కపాటి కోటేశ్వరరావు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ వైద్యుల ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలను సహించబోమని, తప్పుడు ప్రచారాలపై ఇకపై లీగల్ సెల్ ద్వారా పోరాడుతామని స్పష్టం చేశారు.