అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, కొరవడిన సమన్వయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడింది. ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహం లేకపోవడం, ఎవరికి వారೇ యమునా తీరే అన్నట్లు వ్యవహరించడం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ముఖ్యమంత్రితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మంత్రుల పొగడ్తలు, సభ బహిష్కరణ నిర్ణయాన్ని ధిక్కరించి ఎమ్మెల్యేలు హాజరుకావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్షేత్రస్థాయిలో ఎదగాల్సిన పార్టీలో ఈ క్రమశిక్షణా రాహిత్యం పెద్ద శాపంగా మారుతోంది.