నల్లమల అటవీ ప్రాంతంలో తిరిగి ప్రారంభమైన సఫారీ సేవలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అచ్చంపేట

నల్లమల అటవీ ప్రాంతంలో మూడు నెలల విరామం అనంతరం గురువారం సఫారీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అమ్రాబాద్ డివిజనల్ అటవీశాఖాధికారి యష్ ప్రకాష్ సింగల్, రేంజ్ అధికారి సవితతో కలిసి ఫరహాబాద్ చౌరస్తా వద్ద సఫారీ సేవలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రస్తుతం 42 పెద్ద పులులు ఉన్నాయని, పర్యాటకుల సౌకర్యార్థం ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధంతో పాటు అటవీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.