రాజోలు కళాశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

రిపోర్టర్: K NAGA SRINU స్థలం: రాజోలు

హెచ్ఐవీ/ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమిష్టి అవగాహనతో పాటు సరైన వైద్య చికిత్స, సూచనలు పాటించడం ద్వారా హెచ్ఐవీని నియంత్రించవచ్చని క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ జి. రామనాయుడు అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్ఆర్సీ కో-ఆర్డినేటర్ ఎం. శైలజ అధ్యక్షతన హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామనాయుడు, రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐసీటీసీ కౌన్సిలర్ వి. ప్రతాప్ కుమార్ హాజరై విద్యార్థులకు హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వ్యాధి పట్ల భయపడకుండా సరైన సమాచారం తెలుసుకోవాలని, హెచ్ఐవీ నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం. సరిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.