నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆర్ఆర్బీ పారామెడికల్ పరీక్ష తేదీలు ఖరారు
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేయనున్న పారామెడికల్ పోస్టుల పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సీఈఎన్ 05/2026 నోటిఫికేషన్ కింద కంప్యూటర్ ఆధారిత పరీక్షను నవంబర్ 24 మరియు 25 తేదీలలో నిర్వహిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 590 ఖాళీలను భర్తీ చేయనుండగా, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.