భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీన విజయదశమి రోజు నుండి అధికారికంగా అమలులోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. భారతీయ రైతులకు రక్షణ కల్పిస్తూనే, ఆయుష్ రంగానికి గుర్తింపు మరియు నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రత్యేక వీసాలు ఈ ఒప్పందంలో కల్పించారు.