అంగరంగ వైభవంగా కడలి వారి పాలెం వినాయక నిమజ్జనం

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: ఐనవిల్లి

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం కడలి వారి పాలెంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి ఊరేగింపు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తిశ్రద్ధలతో వినాయకుడి ప్రతిమను కాలువలో నిమజ్జనం చేశారు.