హోటళ్లలో నాణ్యతా లోపం: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వంటశాలల తీరుపై విమర్శలు
రిపోర్టర్: శివ
స్థలం: సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయని ఆహార భద్రతా విభాగం అధికారులు తెలిపారు. మిగిలిన మాంసం, కూరగాయలను ఫ్రిజ్లో నిల్వ చేసి మర్నాడు వినియోగిస్తున్నారని, కృత్రిమ రంగులు అధికంగా వాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది కొరతతో తనిఖీలు నామమాత్రంగా మారడంతో ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.