వైసీపీ అధినేత జగన్‌కు యూరప్ పర్యటనకు కోర్టు అనుమతి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబ సమేతంగా యూరప్‌లోని తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు ఆయన కోర్టును ఆశ్రయించగా.. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు పర్యటించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. పర్యటనకు ముందే ప్రయాణ ప్రణాళికతో పాటు ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలను సీబీఐకి సమర్పించాలని ఆదేశించింది.