ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఘటనపై కలెక్టర్ రాజర్షి షా స్పష్టత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Adilabad
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ విభాగంలో జరిగిన ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యం అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.