బంగ్లాదేశ్ లో విషాదం: చెరువులో విగతజీవుడిగా కనిపించిన జమ్ముకశ్మీర్ వైద్య విద్యార్థి

రిపోర్టర్: మహేష్ స్థలం: Sopore

బంగ్లాదేశ్ లో ఎంబీబీఎస్ చదువుతున్న జమ్ముకశ్మీర్ కు చెందిన అద్నాన్ అల్తాఫ్ అదృశ్యమైన రెండు రోజుల తర్వాత చెరువులో శవమై తేలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోపోర్ కు చెందిన అద్నాన్ స్థానిక ఈస్టర్న్ మెడికల్ కాలేజీలో చదువుతున్నాడని, నవంబర్ 2న క్యాంపస్ నుంచి వెళ్లిపోయిన అతడు విగతజీవుడిగా లభించాడని వెల్లడించారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లి తీవ్ర మనోవేదనతో ఆసుపత్రిపాలైందని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహకరించాలని వారు విన్నవించారు.