మండలంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మాడ్గుల్
మాడ్గుల మండల కేంద్రంలోని గిరికొత్తపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వినాయకుని సన్నిధిలో సిఐ వేణుగోపాల్ సర్పంచ్ భాగ్యమ్మ, ఉపసర్పంచ్ ఖదీర్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సౌండ్ బాక్సుల సమీపంలో చిన్న పిల్లలను తీసుకురావద్దని హెచ్చరించారు.