రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల అబ్జర్వర్‌గా బాన్సువాడ పీడీ జె. పీర్యా నియామకం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వదో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్చరీ పోటీలకు అబ్జర్వర్‌గా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలాపూర్ క్యాంప్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల పీడీ జె. పీర్యా నియమితులైనట్లు ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ. ఉషారాణి తెలిపారు. నవంబర్ మూడు నుండి ఐదు వరకు హైదరాబాద్ లోని హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో ఈ పోటీలు జరగనున్నాయి.