హైవేపై లారీ బీభత్సం: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో కూలీ దుర్మరణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: సంగం

ముంబయి జాతీయరహదారిపై వేగంగా వచ్చిన బొగ్గు లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో సంగంలో గురువారం ఒకరు మృతి చెందారని ఎస్సై కె.భోజ్యానాయక్ తెలిపారు. పెరమన గ్రామానికి చెందిన కాకర్ల చెన్నకేశవరెడ్డి కూలీల కోసం సంగం వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కొండ కూడలి వద్ద కృష్ణపట్నం నుంచి బళ్లారికి వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.