తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో చర్చలు జరిపిన సీఎం రేవంత్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తు వరకు చేపట్టాలని ఈ భేటీలో కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదనపై దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించి అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.