నంది వడ్డేమాన్ గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు

రిపోర్టర్: User స్థలం: బిజినేపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో విజయదశమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి వేదమంత్రాల నడుమ శమీ పూజలు జరిపించారు. గ్రామస్తులు ఒకరికొకరు జమ్మి ఆకులు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.