కేంద్రం వద్ద అడుక్కోవడానికి వెళ్లే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు?

రిపోర్టర్: వెంకట్ స్థలం: హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అధికారుల పనితీరుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిధుల కోసం కేంద్రం వద్దకు గిన్నె పట్టుకుని అడుక్కోవడానికి వెళ్లే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారంటూ అధికారులను నిలదీశారు. ఆమె వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది.