'సీబీఎఫ్‌సీ బోర్డులో చోటు దక్కింది': నిర్మాత సుప్రియా యార్లగడ్డ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటి సుప్రియా యార్లగడ్డకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్రం తాజాగా పునర్వ్యవస్థీకరించిన కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో 18 మంది సభ్యుల్లో ఒకరిగా ఆమెకు చోటు దక్కింది. ఈ కొత్త బోర్డు సభ్యుల పదవీకాలం మూడేళ్లపాటు కొనసాగనుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి జాతీయ స్థాయి ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో ఆమెకు ప్రాతినిధ్యం లభించడం పట్ల సినీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.