మార్గదర్శి కేసు ముగియలేదు.. వెంకయ్య వ్యాఖ్యలపై ఉండవల్లి ఫైర్

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: రాష్ట్రం

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మార్గదర్శికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చిందన్న వెంకయ్య వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రామోజీరావు మరణం కారణంగానే కేసు కొట్టివేత జరిగిందని, ఇది క్లీన్చిట్ కాదని స్పష్టం చేశారు.

తాను ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉండవల్లి తేల్చిచెప్పారు. రిట్ పిటీషన్, రివ్యూ పిటీషన్ వేయడంతో పాటు రాష్ట్రపతిని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మార్గదర్శి అక్రమ వసూళ్లను తప్పుబట్టాయని ఆయన గుర్తు చేశారు.