పార్వతీపురం మన్యం: రెండు కోట్ల వ్యయంతో కళాశాల వసతి గదులు ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం కేజీబీవీ జూనియర్ కళాశాలలో రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు వసతి గదులను ప్రారంభించినట్లు సంధ్య రాణి పార్వతీపురం వెల్లడించారు. ఈ నూతన వసతి గదుల ద్వారా రెండువందల నలభై మంది విద్యార్థినులకు మెరుగైన వసతి సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినుల సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సంధ్య రాణి తెలిపారు.