'ప్రజా సమస్యలు గాలికొదిలేసి రాజకీయ నాటకాలు': అసెంబ్లీ తీరుపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన సభలో.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కేవలం ఒకరినొకరు తిట్టుకోవడానికే సమయం కేటాయించడం దారుణమని ఆయన ఘాటుగా విమర్శించారు.