భక్తిపారవశ్యంతో పులకించిన బయ్యన్న గుట్ట కాలభైరవ క్షేత్రం

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ పరిధిలోని ప్రసిద్ధ బయ్యన్న గుట్టపై వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కన్నులపండువగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలు పొందారు.