సమాజ హితం కోరి శ్రమించే సీనియర్ విలేకరులకు అరుదైన సత్కారం

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని పట్టణంలో వరసిద్ధి వినాయకుని సన్నిధిలో సీనియర్ విలేకరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైస్సార్ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని సీనియర్ జర్నలిస్టులను శాలువాలతో సత్కరించారు. సమాజంలో నెలకొన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి సమాజ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ విలేకరులను గౌరవించడం ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు.