గణేష్ ఉత్సవాల వేళ శాంతి శోభలు నింపేందుకు సిద్ధమైన యంత్రాంగం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఏసీపీ జానకి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజేలు, ప్యాడ్ బ్యాండ్ మ్యూజిక్‌పై కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని, పోలీసు శాఖకు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ సంతోష్, అధికారులు పాల్గొన్నారు.