'నియమావళి ఉల్లంఘన సహించబోం': సబలెంకకు భారీ జరిమానా
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో రిబకినా చేతిలో ఓటమిపాలై తీవ్ర నిరాశకు గురైన బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంక కోర్టులో ఆగ్రహంతో రాకెట్‌ను నేలకేసి కొట్టడంపై యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఈ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన నిర్వాహకులు ఆమెకు 7,500 అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.7 లక్షలు) భారీ జరిమానా విధించారు. ఈ ఓటమితో ఆమె ప్రపంచ నంబర్ 1 మహిళా టెన్నిస్ క్రీడాకారిణి హోదాను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది.