సోషల్ మీడియాలో లీకైన మోస్ట్ అవైటింగ్ అవెంజర్స్ డూమ్స్ డే సినిమా
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
అవెంజర్స్ డూమ్స్ డే సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీకైందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఆంథోని రుసో, జో రుసో దర్శకత్వంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం టెలిగ్రామ్ యాప్లో చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు రావడంతో మార్వెల్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ లీక్ వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.