నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి ఎన్టీపీసి గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ ఆరో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుందని, అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.