సెమీ కండక్టర్ల రంగంలో ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్రంలో సెమీ కండక్టర్ల రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టం ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో మూడు సంస్థల ప్రతిపాదనలు మినహా ముప్పై ఐదు వేల ఆరు వందల ఐదు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు మందికి ఉపాధి లభిస్తుందని ప్రతిపాదనలు పేర్కొన్నాయి.