జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్డబ్ల్యూజే డెబ్బై ఆరో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం పోరాడుతోందని వెల్లడించారు. అన్నం సేవా ఫౌండేషన్లో కేక్ కట్ చేసి అనాథలకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు.