బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.