హ్యాపీ జర్నీ సినిమా విజయం సాధించినందుకు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ జర్నీ సినిమా విజయవంతం కావడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు అభిరామ్ నాయుడుతో పాటు నటీనటులు ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనా తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.