ఉద్యోగ ఆఫర్లు రద్దు చేసిన ఇరవై రెండు కంపెనీలపై ఐఐటీల వేటు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

విద్యార్థుల ఉద్యోగ ఆఫర్లను వివిధ కారణాలతో రద్దు చేసిన ఇరవై రెండు కంపెనీలపై దేశంలోని ఐఐటీలు కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలపై రాబోయే రెండేళ్లపాటు రిక్రూట్మెంట్ పరంగా ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. రాబోయే గ్రాడ్యుయేషన్ బ్యాచ్కు సంబంధించి నూట యాభైకి పైగా ఆఫర్లను వివిధ కంపెనీలు వెనక్కి తీసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.