అసెంబ్లీ ముట్టడించిన జీహెచ్ఎంసీ కార్మికుల అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
చెత్త సేకరణ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు కార్మికులను బలవంతంగా అడ్డుకుని వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.