ఆస్పత్రి నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన పోక్సో కేసు నిందితుడు కిషోర్ కుమార్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి రిమాండ్‌లో ఉంటూ, చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించిన సమయంలో తప్పించుకున్నాడు. బుధవారం తన సొంత గ్రామానికి చేరుకుని చెరువు గట్టుపై చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.