యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు పోటెత్తిన రూ పదహారు లక్షల ఆదాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం పదహారు లక్షల ఎనిమిది వేల ఇరువై ఎనిమిది రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలతో పాటు ప్రధాన బుకింగ్, బ్రేక్, విఐపి దర్శనాలు, ప్రసాద విక్రయాల ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.