ఆంధ్రప్రదేశ్ లో రెసిడెన్స్ ప్రూఫ్ నిబంధనలలో కీలక మార్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ ప్రూఫ్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజలు ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఆధార్, రేషన్ కార్డులను నివాస ధ్రువీకరణకు పరిగణించాలని నిర్ణయించింది. కేంద్ర విద్యాసంస్థలు, రిక్రూట్మెంట్ల కోసం మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేయనుండగా, జీఓ 592 ద్వారా తహసీల్దార్లకు సర్టిఫికెట్ల జారీ అధికారాన్ని పునరుద్ధరించారు.