హైదరాబాద్లో దసరా రద్దీ: ప్రయాణికుల సౌకర్యార్థం ఏడు వేల ప్రత్యేక బస్సులు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

దసరా పండుగ వేళ హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయని టీజీఎస్ ఆర్టీసి అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల నుంచి ఏడు వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా వర్తిస్తుందని, పసిపిల్లలతో బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసి యాజమాన్యం స్పష్టం చేసింది.