భారీ ఉద్యోగ కోతలకు డిస్నీ సన్నాహం: ఖర్చుల తగ్గింపునకు మేనేజర్లకు ఆదేశాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా వేలాది ఉద్యోగాల కోతపై వాల్ట్ డిస్నీ సంస్థ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. వార్షిక వ్యయాలను ఇరవై శాతం మేర తగ్గించాలని కొందరు మేనేజర్లను కంపెనీ యాజమాన్యం ఆదేశించిందని సమాచారం. కృత్రిమ మేధ వినియోగం పెరగడం, థియేటర్లలో చిత్రాల ప్రదర్శన మందగించడం, స్ట్రీమింగ్ రంగంలో పోటీ తీవ్రం కావడంతో ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు జోష్ డమారో తెలిపారు.