రేషన్ సరుకులు నిలిపివేతపై నిరసన: కూటమి సర్కార్‌పై కాంగ్రెస్ నేత ధ్వజం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
దసరా పండుగ వేళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పేదలను తీవ్రంగా మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మువ్వల శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బొబ్బిలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ కందిపప్పు, పంచదార, గోధుమపిండి నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచిస్తోందని, తక్షణమే అన్ని సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.