నేర పరిశోధన కోసం కొత్త ఎంఎఫ్‌యూ వాహనం పరిశీలన

రిపోర్టర్: రాము స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లాలో నేరస్థలంలోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎఫ్‌యూ వాహనాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. శాస్త్రీయ ఆధారాలతో నేర పరిశోధన మరింత పటిష్టం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.